Breaking News

టీమిండియాతో రెండో టెస్ట్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మరో ఆల్‌రౌండర్‌కు పిలుపు

Published on Thu, 11/28/2024 - 11:09

అడిలైడ్‌ వేదికగా టీమిండియాతో జరిగే రెండో టెస్ట్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (నవంబర్‌ 28) ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌కు పిలుపు వచ్చింది. ఇప్పటికే జట్టులో ఉన్న పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఫిట్‌నెస్‌ సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా వెబ్‌స్టర్‌ను ఎంపిక చేశారు. తొలి టెస్ట్‌ అనంతరం మార్ష్‌కు స్వల్ప గాయమైనట్లు తెలుస్తుంది.

రెండో టెస్ట్‌లో మార్ష్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఇదే జరిగితే ఆ జట్టు ఫ్రంట్‌లైన్‌ పేసర్లు స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌లపై భారం పడుతుంది.

కాగా, వెబ్‌స్టర్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వెబ్‌స్టర్‌కు గత రెండు సీజన్‌లలో అద్భుతంగా రాణించాడు. గతేడాది అతను షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో 900కు పైగా పరుగులు చేసి 30 వికెట్లు తీశాడు. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్‌ తర్వాత వెబ్‌స్టర్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 

ప్రస్తుత ఫస్ట్‌క్లాస్‌ సీజన్‌లో వెబ్‌స్టర్‌ ఇప్పటికే 448 పరుగులు చేసి, 16 వికెట్లు తీశాడు. బీజీటీకి ముందు ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో వెబ్‌స్టర్‌ ఆల్‌రౌండ్‌ షోతో (61 నాటౌట్‌, 46 నాటౌట్‌; 3/19, 3/49) అదరగొట్టాడు.

టీమిండియాతో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్‌కీపర్‌), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్‌, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్ , బ్యూ వెబ్‌స్టర్
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)