Breaking News

రాణించిన కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌.. టీమిండియా స్కోర్‌ ఎంతంటే..?

Published on Tue, 02/24/2026 - 13:07

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (53), వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్‌ (43), రిచా ఘోష్‌ (23) కూడా సహకరించడంతో భారత్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది. 

వీరు మినహా భారత ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్‌ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్‌, శ్రీచరణి తలో 2, ఓపెనర్‌ ప్రతీక రావల్‌ డకౌటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది. 

మెగాన్‌ షట్‌ (9-1-42-2), సోఫీ మోలినెక్స్‌ (5-1-17-1), తహ్లియా మెక్‌గ్రాత్‌ (4-0-16-1), డార్సీ బ్రౌన్‌ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్‌ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్‌ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)