Breaking News

మాక్స్‌వెల్‌ విధ్వంసం.. వెస్టిండీస్‌పై ఆసీస్‌ ఘన విజయం

Published on Sun, 07/27/2025 - 12:40

సెయింట్‌ కిట్స్‌ వేదికగా జరిగిన నాలుగో టీ20లో విండీస్‌పై 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

విండీస్‌ బ్యాటర్లలో షెర్ఫెన్‌ రూథర్‌ ఫర్డ్‌(31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిమోరియా షెఫర్డ్‌(28), హోల్డర్‌(26),రావ్‌మన్‌ పావెల్‌(28) రాణించారు. మూడో టీ20 సెంచరీతో మెరిసిన కెప్టెన్‌ షాయ్‌ హోప్‌(10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో  జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్‌ హార్దే, బెర్ట్‌లెట్‌, అబాట్‌ తలా వికెట్‌ సాధించారు.

మాక్స్‌వెల్‌ విధ్వంసం..
అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్‌ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), జోష్‌ ఇంగ్లిష్‌(51) హాఫ్‌ సెంచరీలతో చెలరేగగా.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌(18 బంతుల్లో 6 సిక్సర్లతో, ఒ​క​ ఫోరుతో 47) తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

విండీస్‌ బౌలర్లలో బ్లేడ్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్‌, షెఫర్డ్‌, హోస్సేన్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఆసీస్‌ దూసుకెళ్తోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఇరు జట్లు మధ్య ఐదో టీ20 ఇదే వేదికలో జూలై 29న జరగనుంది.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రాహుల్‌-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)