Breaking News

కోవిడ్‌ ఉందని తెలిసినా ఆడించడమెందుకు.. ఇలా దూరం పెట్టడమెందుకు..?

Published on Thu, 01/25/2024 - 10:45

క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్‌ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్‌తో రెండో టెస్ట్‌ ప్రారంభానికి ముందు ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ కోవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా విండీస్‌తో మ్యాచ్‌లో గ్రీన్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది.

కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్‌కు కోవిడ్‌ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్‌ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్‌ సహచరులతో పాటు లైన్‌లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు.

కోవిడ్‌ ఉందన్న కారణంగా గ్రీన్‌ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపినట్లు సమాచారం. గ్రీన్‌ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్‌ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు.

మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్‌ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్‌ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్‌ జట్టులో గ్రీన్‌తో పాటు హెడ్‌ కోచ్‌ మెక్‌ డోనాల్డ్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డాడు.

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌-విండీస్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ బ్రిస్బేన్‌ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 38/1గా ఉంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 4 పరుగులు చేసి హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (17), కిర్క్‌ మెక్‌కెంజీ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)