Breaking News

మ్యాక్స్‌వెల్‌ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం

Published on Sun, 02/11/2024 - 15:25

అడిలైడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్‌ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు.

మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్‌ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్‌ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (14 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.

వార్నర్‌ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్‌ ఇంగ్లిస్‌ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్‌ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్‌ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్‌ బౌలింగ్‌ లైనప్‌ కకావికలమైంది.

ఆ జట్టు బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2, అల్జరీ జోసఫ్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అల్జరీ జోసఫ్‌ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్‌ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)