చరిత్ర సృష్టించిన హరీస్‌ రౌఫ్‌

Published on Sat, 11/16/2024 - 17:10

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్‌ ఖాన్‌ సరసన​ నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్‌ 16) జరుగుతున్న ‌మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్‌ ఈ ఘనత సాధించాడు. రౌఫ్‌ తన 72 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్‌ ఖాన్‌ 96 ఇన్నింగ్స్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. 

పాక్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ తర్వాత షాహిద్‌ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్‌ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్‌ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్‌ తరఫున లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా అవతరించాడు.

ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్‌ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్‌, కులశేఖర తర్వాత కృనాల్‌ పాండ్యా (4/36), క్రిస్‌ వోక్స్‌ (3/4), టిమ్‌ సౌథీ (3/6) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్‌ రౌఫ్‌ (4/22), అబ్బాస్‌ అఫ్రిది (3/17), సూఫియాన్‌ ముఖీమ్‌ (2/21) ఆసీస్‌ పతనాన్ని శాశించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జేక్‌ ఫ్రేజర్‌ (20), మ్యాక్స్‌వెల్‌ (21), స్టోయినిస్‌ (14), టిమ్‌ డేవిడ్‌ (18), ఆరోన్‌ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)