Breaking News

భీకర ఫామ్‌లో బవుమా.. వ్యక్తిగత అవమానాలు దిగమింగి..!

Published on Tue, 09/12/2023 - 19:31

ప్రపంచ క్రికెట్‌లో ఫామ్‌తో సంబంధం లేకుండా క్రికెటేతర విషయాలైన రూపం, వర్ణం, ఆహార్యం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారధి టెంబా బవుమానే అని చెప్పాలి. ఈ సఫారీ స్టార్‌ గతంలో అనేక సందర్భాల్లో క్రికెటేతర కారణాల చేత అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత జట్టు సభ్యులతో సహా తన చుట్టూ ఉన్నవారంతా తన ఆహార్యాన్ని గేలి చేసినప్పటికీ ఎంతమాత్రం చలించని ఈ సఫారీ బ్యాటింగ్‌ యోధుడు, తనకు అవమానం ఎదురైన ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

ప్రస్తుతం బవుమా అదే పనిలోనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు తన ఆటను కించపరిచే వారికి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ సమాధానం​ చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌ మినహాయించి మిగతా రెండు ఫార్మాట్లలో ఈ ఏడాది బవుమా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను టెస్ట్‌ల్లో (1), వన్డేల్లో (3) నాలుగు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వన్డేల్లో అతని ఫామ్‌ అసామాన్యమైనదిగా ఉంది. ఈ ఏడాది అతనాడిన 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సహా 637 పరుగులు చేశాడు. 

తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన జట్టు నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నప్పటికీ, అతనొక్కడు అద్భుతంగా రాణిస్తూ, తన జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కోకుండా కాపాడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న మూడో వన్డేలో బవుమా 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఫలితంగా సఫారీ టీమ్‌ 39 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బవుమాతో పాటు డికాక్‌ (82), రీజా హెండ్రిక్స్‌ (39), మార్క్రమ్‌ (43 నాటౌట్‌) రాణించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంకా 11 ఓవర్లు ఆడాల్సి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)