Breaking News

ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌! ఎవ‌రంటే?

Published on Mon, 11/18/2024 - 13:07

హోబ‌ర్ట్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో త‌ల‌ప‌డేందుకు పాకిస్తాన్ సిద్ద‌మైంది. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌.. క‌నీసం ఆఖ‌రి టీ20లోనైనా గెలిచి పరువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది.

అయితే ఈ చివ‌రి మ్యాచ్‌లో పాక్ జ‌ట్టు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూల‌ర్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో పాక్ జ‌ట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. 

వీరిద్ద‌రి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేస‌ర్ జహందాద్ ఖాన్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. అయితే 21 ఏళ్ల  జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంత‌ర్జాతీయ టీ20 కావ‌డం గ‌మ‌నార్హం. దేశవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండండంతో జ‌హందాద్‌కు సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్‌(కెప్టెన్‌/  వికెట్ కీప‌ర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపా

పాకిస్తాన్‌: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్‌ ముఖీమ్‌
చదవండి: అత‌డొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)