Breaking News

కమిన్స్‌ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్‌ చిత్తు.. సిరీస్‌ ఆస్ట్రేలియాదే

Published on Fri, 12/29/2023 - 14:48

Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్‌ మసూద్‌ సారథ్యంలో పాకిస్తాన్‌ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్‌ భావించింది.

బాక్సింగ్‌ డే టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్‌. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్‌ మసూద్‌ బృందం ఆలౌట్‌ కావడంతో.. ఆసీస్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది.

ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు పాక్‌ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, మీర్‌ హంజా దెబ్బకు టాపార్డర్‌ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ ఇబ్బందుల్లో పడింది.

ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్‌ మార్ష్‌ (96; 13 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి  ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించి ఆసీస్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. 

ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ బెంబేలెత్తించాడు.

ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మరో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్‌ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్‌ మసూద్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్‌ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది.

79 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ నాలుగు, జోష్‌ హాజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ప్యాట్‌ కమిన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య  నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది.

కాగా ఆస్ట్రేలియాలో పాక్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్‌ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)