Breaking News

ముంబై ఇండియన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌.. అర్జున్‌ స్ధానంలో?

Published on Sat, 11/22/2025 - 15:08

ఐపీఎల్‌-2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్  (MI)  తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఈ మినీ వేలానికి ముందు  జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీని ముంబై ఇండియన్స్‌  ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నబీ శుక్రవారం ఘన్సోలీలోని ఎంఐ ఫెసిలిటీలో ట్రయల్స్‌కు హాజరైనట్లు సమాచారం. 

అబుదాబి డిసెంబర్ 16న జరగనున్న వేలంలో అతడిని కొనుగోలు చేయాలని ముంబై యాజమాన్యం బావిస్తుందంట. కాగా  ఈ 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గత కొన్నాళ్లగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గత రంజీ  సీజన్‌లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన నబీ(44).. ప్రస్తత సీజన్‌లో కూడా అద్బుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.

ఈ జమ్మూ కాశ్మీర్‌ స్పీడ్‌ స్టార్‌ 29 వికెట్లతో సెకెండ్‌ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అయితే నబీ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. టీ20ల్లో మాత్రం అతడి గణాంకాలు అంత గొప్పగా లేవు. అయినప్పటికి తన పేస్, స్వింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే సత్తా అతడి వద్ద ఉంది. 2019 టీ20ల్లో అరంగేట్రం చేసిన నబీ.. 27 మ్యాచ్‌లలో  26.39 సగటుతో 28 వికెట్లు తీశాడు. 

అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 19.98 సగటుతో  125 వికెట్లు పడగొట్టాడు. కాగా మినీ వేలానికి ముందు  లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ స్థానాన్ని నబీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అర్జున్ ముంబై తరపున రెండు సీజన్లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబై జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా, బౌల్ట్‌ వంటి అద్భుతమైన బౌలర్లు ఉండడంతో అర్జున్‌ పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ముంబై అతడిని రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌కు లక్నోకు ట్రేడ్‌ చేసింది.  ప్రస్తుతం ముంబై పర్స్‌లో కేవలం రూ.2.7 కోట్లు మాత్రమే ఉన్నాయి.
చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్‌ ఏం తప్పు చేశాడు?: కోచ్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)