Breaking News

ISL 2023: సెమీఫైనల్లో మోహన్‌ బగాన్‌ జట్టు

Published on Sun, 03/05/2023 - 08:32

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఏటీకే మోహన్‌ బగాన్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మోహన్‌బగాన్‌ 2–0 గోల్స్‌ తేడాతో ఒడిషా ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. మోహన్‌బగాన్‌ తరఫున బోమన్‌ (36వ నిమిషం), డి.పెట్రాడోస్‌ (58వ నిమిషం) గోల్స్‌ సాధించారు.

తాజా విజయంతో  20 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 34 పాయింట్లు సాధించిన మోహన్‌బగాన్‌ నాలుగో జట్టుగా ఐఎస్‌ఎల్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో 10 విజయాలు సాధించిన టీమ్‌ 6 ఓడి మరో 4 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో సెమీస్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీతో మోహన్‌బగాన్‌ ప్రత్యర్థిగా తలపడటం ఖాయమైంది.

సెమీఫైనల్‌ మ్యాచ్‌ రెండు అంచెలుగా జరుగుతుంది. ఇరు జట్ల మధ్య తొలి పోరు ఈ నెల 9న హైదరాబాద్, రెండో పోరు ఈ నెల 13న రెండో పోరు కోల్‌కతాలో జరుగుతుంది. మరో సెమీస్‌ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడనున్నాయి.    

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)