Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. రేపే టీమిండియా మ్యాచ్‌.. ప్రత్యర్ధి ఎవరంటే..?

Published on Mon, 10/02/2023 - 15:24

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషుల క్రికెట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. జట్ల సీడింగ్‌ ఆధారంగా భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా నేపాల్‌, హాంగ్‌కాంగ్‌, మలేషియా జట్లు ఫైనల్‌ 8కు చేరాయి. 

టీమిండియా మ్యాచ్‌ ఎవరితో, ఎప్పుడంటే..?
ఈ పోటీల్లో టీమిండియా మ్యాచ్‌ రేపు జరుగనుంది. తొలి క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్‌.. టీమిండియాతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రేపు (అక్టోబర్‌ 3) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఈ పోటీల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలోని టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నేపాల్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగనుంది. నేపాల్‌ జట్టు సభ్యులు ఇటీవలే మంగోలియాపై పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌, ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి, అత్యధిక టీమ్‌ స్కోర్‌.. ఇలా ఈ మ్యాచ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. 

మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఎవరెవరంటే..?
తొలి క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌, నేపాల్‌ జట్లు తలపడనుండగా.. రెండో క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌ (అక్టోబర్‌ 3న ఉదయం 11:30 గంటలకు), మూడో క్వార్టర్‌ ఫైనల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ (అక్టోబర్‌ 4న ఉదయం 6:30 గంటలకు), నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌, మలేషియా (అక్టోబర్‌ 4న ఉదయం 11:30 గంటలకు) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు అక్టోబర్‌ 6న జరిగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్‌ 7న స్వర్ణ పతకం కోసం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)