Breaking News

Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌

Published on Sun, 09/24/2023 - 16:05

హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్‌ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్‌ (2 రోయింగ్‌, ఒకటి షూటింగ్‌), 2 బ్రాంజ్‌ మెడల్స్‌ (షూటింగ్‌లో ఒకటి, రోయింగ్‌లో ఒకటి) ఉన్నాయి. 

మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్‌ ఘోష్‌, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌ రోయింగ్‌లో భారత జోడీ అర్జున్‌ లాల్‌ ఝట్‌, అరవింద్‌ సింగ్‌ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది.

రోయింగ్‌ మెన్స్‌ పెయిర్‌ ఈవెంట్‌లో బాబు లాల్‌ యాదవ్‌, లేఖ్‌ రామ్‌ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్‌ మెన్స్‌ 8 ఈవెంట్‌లో భారత్‌ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది.

కాగా, ఈసారి ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్‌ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్‌ (16 గోల్డ్‌, 23 సిల్వర్‌, 31 బ్రాంజ్‌) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్‌ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)