Breaking News

అహ్మదాబాద్‌లో ఆసియా కప్‌ అండర్‌–17 క్వాలిఫయర్స్‌ టోర్నీ

Published on Wed, 08/06/2025 - 04:22

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ అండర్‌–17 ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీకి భారత్‌ కూడా ఓ వేదికైంది. ఆసియా కప్‌–2026 కోసం నిర్వహించే క్వాలిఫయర్స్‌కు ఏడు దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందులో భారత్‌ కూడా ఉంది. భారత్‌కు సంబంధించిన పోటీలను ఈ నవంబర్‌ 22 నుంచి 30 వరకు అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పాల్గొనే మొత్తం 38 దేశాల జట్లను ఏడు గ్రూప్‌లుగా విభజిస్తారు. మూడు గ్రూప్‌ల్లో ఆరేసి జట్లు, నాలుగు గ్రూప్‌ల్లో ఏడేసి జట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన ‘డ్రా’ను రేపు తీయనున్నారు. 

ఈ ఏడు గ్రూప్‌ల విజేత జట్లు సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇంతకుముందే 9 జట్లకు డైరెక్ట్‌ ఎంట్రీ లభించింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగిన అండర్‌–17 ప్రపంచకప్‌లో తలపడటం ద్వారా 9 జట్లకు ఈ అవకాశం లభించింది. ఆసియాకప్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత్‌ కూడా వేదికవడం పట్ల అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్షుడు కళ్యాణ్‌ చౌబే హర్షం వ్యక్తం చేశారు.

అండర్‌–17 ఫిఫా ప్రపంచకప్‌ నిర్వహించే సత్తా తమకు ఉందని ఏఎఫ్‌సీ క్వాలిఫయర్స్‌ ద్వారా నిరూపించుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)