Breaking News

కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర!

Published on Wed, 09/13/2023 - 09:20

Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్‌-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు.

ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్‌. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్‌ మతీశ పతిరణను బౌల్డ్‌ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు.

150 వికెట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా
ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 

కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్‌.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర
అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్‌ కుంబ్లే, జహీర్‌ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్‌ చరిత్ర సృష్టించాడు.

దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ అనిల్‌ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్‌-2023 ఫైనల్లో ప్రవేశించింది. 

టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన  బౌలర్లు
►మహ్మద్‌ షమీ- 80 మ్యాచ్‌లలో..
►కుల్దీప్‌ యాదవ్‌- 88 మ్యాచ్‌లలో..
►అజిత్‌ అగార్కర్‌- 97 మ్యాచ్‌లలో..
►జహీర్‌ ఖాన్‌- 103 మ్యాచ్‌లలో..
►అనిల్‌ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో..
►ఇర్ఫాన్‌ పఠాన్‌- 106 మ్యాచ్‌లలో..

అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్‌లో చేరిన స్పిన్నర్లు
►సక్లెయిన్‌ ముస్తాక్‌- 78 మ్యాచ్‌లలో
►రషీద్‌ ఖాన్‌- 80 మ్యాచ్‌లలో
►అజంత మెండిస్‌- 84 మ్యాచ్‌లలో
►కుల్దీప్‌ యాదవ్‌- 88 మ్యాచ్‌లలో
►ఇమ్రాన్‌ తాహిర్‌- 89 మ్యాచ్‌లలో.

చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్‌ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్‌ 
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్‌ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)