Breaking News

Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్‌

Published on Tue, 09/12/2023 - 18:29

20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో దునిత్‌ ఈ ఘనత సాధించాడు. దునిత్‌ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది.

బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్‌ కర్నైన్‌ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్‌ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.

దునిత్‌ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్‌ హేమహేమీలైన రోహిత్‌, గిల్‌, విరాట్‌, రాహుల్‌, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్‌ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది.  

దునిత్‌కు మరో స్పిన్నర్‌ మహీష్‌ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్‌ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. రోహిత్‌ శర్మ (53), ఇషాన్‌ కిషన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (39), శుభ్‌మన్‌ గిల్‌ (19), విరాట్‌ కోహ్లి (3), హార్దిక్‌ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్‌ (0) ఔట్‌ కాగా.. అక్షర్‌ (15), సిరాజ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)