Breaking News

కోహ్లి అలా చేస్తాడని ఊహించలేదు.. అది నన్ను క్లీన్‌ బౌల్డ్‌ చేసింది..!

Published on Thu, 09/01/2022 - 15:14

Asia Cup 2022 IND VS HK: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచిన విషయం తెలసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌, సూర్య భాయ్‌ నాటు కొట్టుడు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిస్తే.. భారత ఇన్నింగ్స్‌ అనంతరం కోహ్లి చేసిన ఓ పనికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం పులకించి పోయింది. 

తన కంటే చాలా జూనియర్‌ అయిన సూర్యకుమార్‌ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన కోహ్లి.. ఇన్నింగ్స్‌ అనంతరం సూర్యను తలవంచి మరీ అభినందించాడు. కోహ్లి నుంచి ఊహించని ఈ చర్యకు ఆశ్చర్యపోయిన సూర్యకుమార్‌ ఏం మాట్లాడాలో తెలియక.. ఏంటి బ్రో ఇది.. మనం మనం ఒకటి.. పదా ఇద్దరం కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్దాం అని కోహ్లిని హత్తుకుని అటుగా తీసుకెళ్లాడు. 

దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. కోహ్లి లాంటి అనుభవజ్ఞుడి నుంచి ఊహించిన ఈ చర్యకు చర్యకు ఎలా రియాక్ట్‌ కావాలో అర్ధం కాలేదని, కింగ్‌ కోహ్లి చేసిన ఈ పని నన్ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిందని అన్నాడు. కాగా, కోహ్లి-సూర్యకుమార్‌ల మధ్య ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ చిన్నపాటి గొడవ జరిగిన విషయాన్ని క్రికెట్‌ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సిక్సర్ల సునామీ సృష్టించి, 22 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాదగా.. కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడి కెరీర్‌లో 31వ అర్ధసెంచరీ సాధించాడు. సూర్య.. 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా నిలువగా.. కోహ్లి 44 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్ల సాయంతో 59 చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు పిండుకోవడం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఫలితంగా భారత్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఛేదనలో హాంగ్‌కాంగ్‌ 152 పరుగులకే పరిమతం కావడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. 
చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. తొలి భారత ఆటగాడిగా!
 

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)