Breaking News

డ‌బ్బులిచ్చైనా న్యూజిలాండ్ క్యాంప్‌లో చేరుతా: అశ్విన్‌

Published on Tue, 01/13/2026 - 16:10

వ‌డోద‌ర వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన‌ విషయం తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జ‌ట్టుకు కివీస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో న్యూజిలాండ్ జ‌ట్టుపై భార‌త మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

సీనియ‌ర్లు లేన‌ప్ప‌టికి ప‌ర్యాట‌క జ‌ట్టు పోరాట ప‌టిమ‌ను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఈ ల‌క్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌల‌ర్లు ఆఖ‌రి వ‌ర‌కు శ్ర‌మించారు. కానీ దుర‌దృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్‌క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది.

"చాలా అగ్ర‌శ్రేణి జ‌ట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజ‌య‌వంతంగా అమలు చేయ‌డంలో కివీస్ దిట్ట‌. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్‌లలో పాల్గోవ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను.

అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌కు కేన్‌ విలియమ్సన్‌, టామ్‌ లాథమ్‌, రచిన్‌ రవీంద్ర, మాట్‌ హెన్రీ, శాంట్నర్‌ వంటి కివీ స్టార్‌ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్‌ క్యాప్స్‌ జట్టు కెప్టెన్‌గా మైఖల్‌ బ్రెస్‌వేల్‌ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)