Breaking News

Ind vs Zim: జింబాబ్వేను తేలికగా తీసుకోలేము.. కాబట్టి: అశ్విన్‌

Published on Sat, 11/05/2022 - 15:32

ICC Mens T20 World Cup 2022-  India vs Zimbabwe: ‘‘ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఎంత వీలైతే అంత దూకుడుగా ఉండాలి. ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం చూపాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా పోటీ ఉంది. కాబట్టి బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలి.

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మేటి జట్టు అద్భుత విజయం సాధిస్తేనే బాగుంటుంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ కాబట్టి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలి. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వకూడదు’’ అని టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. 

తేలికగా తీసుకుంటే అంతే సంగతి!
టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా భారత్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా టీమిండియా సెమీస్‌ చేరుతుంది. అయితే, ఇటీవల సంచనాలు నమోదు చేస్తూ పటిష్టమైన జట్లకు షాకిస్తున్న జింబాబ్వేను తేలికగా తీసుకుంటే అనుకున్న ఫలితం రాకపోవచ్చు.

వాళ్లను గౌరవిస్తాం
ఈ నేపథ్యంలో జట్టులో భాగమైన అశ్విన్‌ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న జట్టు కాబట్టి జింబాబ్వేను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్‌లాగే ఇది కూడా తప్పక గెలవాల్సిందే.

జింబాబ్వే ఇటీవల అద్భుతంగా ఆడుతోంది. అలాంటి జట్టును ఈజీగానే పడగొట్టేస్తామని మేము అనుకోవడం లేదు. వాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నారు. వాళ్లను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి లేదు’’ అని అశ్విన్‌ అన్నాడు.

కాగా స్టార్‌ ప్లేయర్‌ సికిందర్‌ రజా అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్‌ మీద ఒకే ఒక్క పరుగుతో జింబాబ్వే విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సెమీస్‌ రేసులో ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల పరిస్థితికి చేరుకుంది.

చదవండి: Ind Vs Ban: ఇండియా క్రికెట్‌ పవర్‌హౌజ్‌.. అయినా కూడా: ఆఫ్రిదికి బీసీసీఐ బాస్‌ కౌంటర్‌
Ind Vs Zim: భారత్‌తో మ్యాచ్‌.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్‌ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్‌
Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్‌ జోక్‌’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)