Breaking News

ఆశిష్‌ అద్భుతం

Published on Thu, 12/04/2025 - 03:53

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంతో... ఆసియా ఈక్వె్రస్టియన్‌ (అశ్విక క్రీడలు) చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయ్‌లాండ్‌లోని పటాయా నగరంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో మెరిసింది. ఈవెంటింగ్‌ కేటగిరీలో టార్గెట్‌ ఏషియన్‌ గేమ్స్‌ గ్రూప్‌ (టీఏజీజీ) సభ్యుడైన ఆశిష్‌ లిమాయే స్వర్ణ పతకాన్ని సాధించాడు. 

ఈ క్రమంలో ఆసియా ఈక్వె్రస్టియన్‌ పోటీల చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆశిష్‌ లిమాయే, శశాంక్‌ సింగ్‌ కటారియా, శశాంక్‌ కనుమూరిలతో కూడిన భారత జట్టు ఈవెంటింగ్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. డ్రెసాజ్‌ ఈవెంట్, ఇంటర్మీడియట్‌ ఫ్రీస్టయిల్‌–1 వ్యక్తిగత విభాగాల్లో శ్రుతి వోరా రజత పతకాలు నెగ్గింది. 

డ్రెసాజ్‌ టీమ్‌ విభాగంలో శ్రుతి వోరా, దివ్యకీర్తి సింగ్, గౌరవ్‌ పుందిర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం హస్తగతం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ 16 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు చేయూత పథకంలో భాగంగా భారత బృందంపై రూ. 2 కోట్ల 73 లక్షలు వెచ్చించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)