Breaking News

Ashes 5th Test Day 5: ఆసీస్‌ను వణికిస్తున్న ఇంగ్లండ్‌ పేసర్లు.. తొలి సెషన్‌లోనే..!

Published on Mon, 07/31/2023 - 17:25

యాషెస్‌ సిరీస్‌-2023లో ఆఖరి (ఐదవది) టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్‌ పేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌లు ఆసీస్‌ ఆటగాళ్లను వణికిస్తున్నారు.  ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్‌ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్‌ కాగా.. లబూషేన్‌ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 

ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక 4వ ఓవర్‌ రెండో బంతికి క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి డేవిడ్‌ వార్నర్‌ పెవిలియన్‌కు చేరగా.. ఆ వెంటనే ఆరో ఓవర్ రెండో బంతికి అదే క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌ ఆఖరి బంతికి మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో జాక్‌ క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి లబూషేన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో ఆసీస్‌ 34 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి (169/3) బిక్కుబిక్కుమంటుంది. 

లబూషేన్‌ ఔటయ్యాక కాస్త దూకుడు పెంచిన ఆసీస్‌ వేగంగా పరుగులు చేస్తూనే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్టీవ్‌ స్మిత్‌ (35 బంతుల్లో 21; 4 ఫోర్లు, ట్రవిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 57 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 210/3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. అదే ఇంగ్లండ్‌ విజయం సాధించలాంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. తొలి సెషన్‌లో ఇప్పటివరకు 19 ఓవర్లు జరిగాయి. ఈ రోజు ఇంకా 71 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)