Breaking News

ఇంగ్లండ్‌ యాషెస్‌ అవకాశాలను నీరుగారుస్తున్న వరుణుడు

Published on Sun, 07/23/2023 - 18:33

5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడినప్పటికీ  అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తూ.. యాషెస్‌ను కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌ పాలిట వర్షం విలన్‌లా మారింది. నాలుగో టెస్ట్‌ తొలి మూడు రోజులు ఏమాత్రం ఇబ్బంది పెట్టని వర్షం నాలుగో రోజు నుంచి ఇంగ్లండ్‌కు సినిమా చూపిస్తుంది.

నిన్న పూర్తి ఆట సాగి ఉంటే నిన్ననే ఇంగ్లండ్‌ మ్యాచ్‌ గెలిచి, సిరీస్‌ సమం చేసుకుని ఉండేది. నిన్న ఆఖరి సెషన్‌లో  ఇంగ్లండ్‌పై జాలి చూపించిన వర్షం కాసేపు ఎడతెరిపినిచ్చింది. వరుణుడు కరుణించినా లబూషేన్‌ (111) కనికరించకపోవడంతో నాలుగో రోజు ఇంగ్లండ్‌ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకుంది. నిన్న జరిగిన 27 ఓవర్ల ఆటలో ఆసీస్‌ 101 పరుగులు స్కోర్‌ చేసి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 

ఐదో రోజైనా వరుణుడు కరుణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ఇంగ్లీష్‌ టీమ్‌కు మరోసారి ఆశాభంగం కలిగింది. వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్‌ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. లంచ్‌ సమయం తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరో 2 గంటలు కొనసాగితే మ్యాచ్‌ జరిగడం దాదాపుగా అసంభవమని అక్కడి వారు చెబుతున్నారు.

మరి ఈ మధ్యలో వరుణుడు ఇంగ్లండ్‌ను కరుణిస్తాడో లేక కనికరం లేకుండా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. లంచ్‌ తర్వాత మైదాన ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఆసీస్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. కనీసం 30 ఓవర్ల ఆట సాధ్యపడినా ఇంగ్లండ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు