Breaking News

యాషెస్‌ సిరీస్‌ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!

Published on Fri, 07/07/2023 - 12:47

యాషెస్‌ సిరీస్‌-2023లో భాగంగా లీడ్స్‌ వేదికగా నిన్న (జులై 6) మొదలైన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మెరుపు సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. మార్ష్‌ సూపర్‌ సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్‌ వచ్చీ రాగానే సెంచరీతో విరుచుకుపడి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 118 బంతులను ఎదుర్కొన్న మార్ష్‌.. 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మార్ష్‌ మినహా మిగతావారెవ్వరూ కనీస పరుగులు కూడా చేయలేకపోయారు. ట్రవిస్‌ హెడ్‌ (39), స్టీవ్‌ స్మిత్‌ (22), లబూషేన్‌ (21), ఉస్మాన్‌ ఖ్వాజా (13), టాడ్‌ మర్ఫీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు సింగిల్‌ డిజిల్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను మార్క్‌ వుడ్‌ (5/34) నిలువునా కూల్చాడు. మార్క్‌ వుడ్‌ సైతం​ దాదాపు ఏడాది తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోయాడు. అతనికి క్రిస్‌ వోక్స్‌ (3/73), స్టువర్ట్‌ బ్రాడ్‌ (2/58) సహకరించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను పాట్‌ కమిన్స్‌ (2/28), మార్ష్‌ (1/9) దెబ్బకొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. రూట్‌ (19), బెయిర్‌స్టో (1) క్రీజ్‌లో ఉన్నారు.

యాషెస్‌ సిరీస్‌ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!
దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇ​చ్చిన మార్ష్‌కు యాషెస్‌ సిరీస్‌ అంటే పూనకం వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. యాషెస్‌లో అతను ఆడిన చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 3 సెంచరీలు (118, 24, 17, 101, 29*, 9, 181) చేశాడు. 33 టెస్ట్‌ల కెరీర్‌లో తాను సాధించిన 3 శతకాలు యాషెస్‌లో సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన మార్ష్‌.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలి రోజు తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమై జాక్‌ క్రాలే (33) వికెట్‌ పడగొట్టాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)