Breaking News

చరిత్ర సృష్టించనున్న నాథన్‌ లయోన్‌.. తొలి బౌలర్‌గా అరుదైన ఘనత

Published on Wed, 06/28/2023 - 09:34

యాషెస్‌ సిరీస్‌ 2023లో భాగంగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో ఇవాళ (జూన్‌ 28) ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. కేవలం ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారానే అతను చరిత్ర సృష్టించనున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో వరుసగా 100 మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఏ ఇతర బౌలర్‌కు ఈ ఫీట్‌ను సాధించలేదు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ సర్‌ అలిస్టర్‌ కుక్‌ వరుసగా 159 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. అతని తర్వాత ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అలెన్‌ బోర్డర్‌ (153), ఆసీస్‌ మార్క్‌ వా (107), ఇండియా సునీల్‌ గవాస్కర్‌ (106), కివీస్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (101) ఉన్నారు. 

ఓవరాల్‌గా చూస్తే.. లయోన్‌ తన కెరీర్‌ మొత్తంలో 121 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 23 ఐదు వికెట్ల ఘనతలు, 4 పది వికెట్ల ఘనతల సాయంతో 495 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్‌ టెస్ట్‌లో లయోన్‌ మరో 5 వికెట్లు పడగొడితే.. 500 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడు.

ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ 2023 తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ అప్రోచ్‌ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్‌ చేసి చేతులు కాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఇంగ్లండ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్‌ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి.

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)