Breaking News

తొలి శతకంతోనే చరిత్రపుటల్లోకెక్కిన ఇంగ్లండ్‌ యువ ఆటగాడు

Published on Wed, 01/07/2026 - 12:16

సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్‌ చివరి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ యువ ఆటగాడు జేకబ్‌ బేతెల్‌ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు. 

ఆస్ట్రేలియాపై  22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్‌ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్‌ ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బేతెల్‌ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్‌ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఏడు డాట్‌ బాల్స్‌ ఆడిన బేతెల్‌ వెబ్‌స్టర్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్‌ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

నాలుగో రోజు చివరి సెషన్‌ సమయానికి బేతెల్‌ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్‌ కార్స్‌ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్‌ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఈ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బేతెల్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్‌, బ్రూక్‌ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్‌ 26, జాక్‌ క్రాలే 1, రూట్‌ 6, స్టోక్స్‌ 1, విల్‌ జాక్స్‌ డకౌటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో వెబ్‌స్టర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, బోలాండ్‌, నెసర్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు హెడ్‌ (163), స్టీవ్‌ స్మిత్‌ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్‌స్టర్‌ 71 (నాటౌట్‌),  వెదర్లాడ్‌ 21, లబూషేన్‌ 48, మైఖేల్‌ నెసర్‌ 24, కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న ఉస్మాన్‌ ఖ్వాజా 17, అలెక్స్‌ క్యారీ 16, గ్రీన్‌ 37 , స్టార్క్‌ 5, బోలాండ్‌ డకౌయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో కార్స్‌, టంగ్‌ తలో 3, స్టోక్స్‌ 2, జాక్స్‌, బేతెల్‌ తలో వికెట్‌ తీశారు. 

దీనికి ముందు జో రూట్‌ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్‌‌ బౌలర్లలో నెసర్‌ 4, స్టార్క్‌, బోలాండ్‌ తలో 2, గ్రీన్‌, లబూషేన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా,ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి