Breaking News

రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు

Published on Sat, 06/17/2023 - 09:00

టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన జో రూట్‌ కొత్తగా కనిపిస్తున్నాడు. బజ్‌బాల్‌ ఆటతీరుతో ఇంగ్లండ్‌ దూకుడు కనబరుస్తుంటే.. రూట్‌ కూడా తన మార్క్‌ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న రూట్‌ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా యాషెస్‌లో తొలి టెస్టులోనే రూట్‌ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 118 పరుగులు నాటౌట్‌గా నిలిచిన రూట్‌ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

రూట్‌ టెస్టు కెరీర్‌లో ఇది 30వ శతకం కావడం విశేషం .టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్,ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్‌ చందర్‌పాల్‌, మాథ్యూ హెడెన్‌లతో కలిసి 30 సెంచరీలతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

ఇక 2021 నుంచి చూసుకుంటే రూట్‌ ఆటతీరు ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. 2021 నుంచి 62 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్‌ 58.91 సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉంటే.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 2022 నుంచి ఇప్పటివరకు ఏడు శతకాలు బాదిన రూట్‌ 2వేల పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో టెస్టుల్లో రూట్‌ మినహా మరే ఇతర బ్యాటర్‌ ఇంత వేగంగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. 

చదవండి: #Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)