Breaking News

SMT 2024: చెల‌రేగిన బౌల‌ర్లు.. 32 ప‌రుగుల‌కే ఆలౌట్‌! టోర్నీ చ‌రిత్ర‌లోనే

Published on Wed, 11/27/2024 - 17:19

స‌య్య‌ద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కేవ‌లం 32 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

జ‌మ్మూ బౌల‌ర్ల దాటికి అరుణాచ‌ల్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. క‌నీసం ఏ ఒక్క బ్యాట‌ర్ కూడా క‌నీసం ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. జ‌ట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాట‌ర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాట‌లేక‌పోయారు.

అరుణాచ‌ల్ సాధించిన 32 ప‌రుగులలో 8 ర‌న్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వ‌చ్చిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. జ‌మ్మూ బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్ల‌తో అరుణాచ‌ల్ ప‌త‌నాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌల‌ర్లు అకీబ్ న‌బీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు. 

కాగా ఇటీవ‌లే జ‌రిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జ‌మ్మూ ఫాస్ట్ బౌల‌ర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్‌ల‌కు జాక్‌పాట్ త‌గిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్‌ను రూ.30 ల‌క్ష‌ల‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కొనుగోలు చేసింది.

అరుణాచ‌ల్ చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. స‌య్య‌ద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చ‌రిత్రలోనే అత్య‌ల్ప స్కోరు న‌మోదు చేసిన రెండో జ‌ట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవ‌లం 30 ప‌రుగుల‌కే ఆలౌటైంది.
చదవండి: ICC Rankings: వ‌ర‌ల్డ్ నెం1 బౌల‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా..

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)