Breaking News

అర్ష్ దీప్‌కు అందలం

Published on Sun, 01/26/2025 - 03:59

దుబాయ్‌: భారత యువ పేసర్‌ అర్ష్ దీప్ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యాడు. గతేడాది భారత జట్టు టి20 ప్రపంచకప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్టార్మ్‌ పేసర్‌... 2024లో ఓవరాల్‌గా 18 మ్యాచ్‌లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. 

వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆరంభ ఓవర్లతో పాటు, డెత్‌ ఓవర్స్‌లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్ దీప్ ఐసీసీ టి20 టిమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా నిలిచిన అర్ష్ దీప్... భారత టి20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. 

టి20ల్లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్... ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2021లో ఐసీసీ ‘టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌)కు ఈ గౌరవం దక్కగా... 2022, 2023లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌) గెల్చుకున్నాడు.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)