Breaking News

స్టార్‌ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్‌

Published on Mon, 01/20/2025 - 07:14

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. అవామీ లీగ్‌ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్‌ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జైదుర్‌ రహమాన్‌.. షకీబ్‌ అల్‌ హసన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. 

మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్‌ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్‌ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. 

స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్‌ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చాంపియన్స్‌ ట్రోఫీకి పరిగణించలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)