Breaking News

సచిన్‌ కొడుకు అట్టర్‌ ప్లాప్‌.. ఉతికారేశారు

Published on Fri, 12/26/2025 - 17:38

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో గోవా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గోవా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.

గోవా బ్యాటర్లలో లలిత్ యాదవ్ (104) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ దీపరాజ్ గాంకర్(71) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హిమాచల్ బౌలర్లలో రోహిత్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మిర్దుల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో హిమాచల్ ప్రదేశ్ 49.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.

మిడిలార్డర్ బ్యాటర్లు పి. రాజ్‌మన్‌(126) తన అద్భుతపోరాటంతో జట్టును విజయతీరాల దాకా తీసుకెళ్లినప్పటికి..  ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో హిమాచల్ ఓటమిచవిచూడాల్సి వచ్చింది. గోవా బౌలర్లలో  దీపరాజ్ గాంకర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో దుమ్ములేపిన దీపరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

అర్జున్ అట్టర్ ప్లాప్‌..
అయితే ఈ మ్యాచ్‌లో గోవా ఆల్‌రౌండర్‌, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అర్జున్‌.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్‌లో అతడికి కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. 

కానీ బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్‌.. 9.70 ఏకానమి రేటుతో ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో అర్జున్‌తో తన పూర్తి కోటాను కెప్టెన్ పూర్తి చేయించలేదు. తొలి మ్యాచ్‌కే బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు హిమాచల్‌పై ఆడే అవకాశం లభించింది. 

కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ జూనియర్ టెండూల్కర్ అందిపుచ్చుకోలేకపోయాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ఫర్వాలేదన్పించాడు. కాగా ఐపీఎల్‌-2026లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి అతడిని లక్నో ట్రేడ్ చేసుకుంది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)