అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్‌ హ్యాట్రిక్‌

Published on Tue, 12/17/2024 - 14:29

అంతర్జాతీయ టీ20ల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదైంది. ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ సబ్‌ రీజియనల్‌ అమెరికా క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా కేమెన్‌ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్‌ బౌలర్‌ హెర్నన్‌ ఫెన్నెల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 

ఫెన్నెల్‌.. కేమెన్‌ ఐలాండ్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019
లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019
కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022
వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.

కేమెన్‌ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్‌ టేలర్‌, అలిస్టర్‌ ఐఫిల్‌, రొనాల్డ్‌ ఈబ్యాంక్స్‌, అలెస్సాండ్రో మోరిస్‌ ఫెన్నెల్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ బాధితులు.

అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్‌ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్‌ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఫెన్నెల్‌.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.

ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్‌,
ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌ కమిన్స్‌
సెర్బియాకు చెందిన మార్క్‌ పావ్లోవిక్‌
న్యూజిలాండ్‌కు చెందిన టిమ్‌ సౌథీ
శ్రీలంకకు చెందిన లసిత్‌ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. 
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)