Breaking News

టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్‌

Published on Tue, 09/16/2025 - 15:21

టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్‌ వచ్చేసింది. అపోలో టైర్స్‌ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్‌ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

 ‘డ్రీమ్ ‌11’తో కటీఫ్‌
కాగా ఫాంటసీ స్పోర్ట్స్‌ కంపెనీ ‘డ్రీమ్ ‌11’ ఇటీవలే భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాక్ట్‌’ను అనుసరించి.. డ్రీమ్‌ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. 

ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్‌ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు
అయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్‌ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్‌ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్‌లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్‌ 11 జెర్సీ స్పాన్సర్‌గా ఉండి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది.

కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్‌, బిర్లా ఓప్టస్‌ పెయింట్స్‌ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్‌ తమ బిడ్‌ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్‌ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్‌ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)