Breaking News

సౌతాఫ్రికాకు బిగ్‌ షాక్‌

Published on Thu, 12/12/2024 - 15:52

సౌతాఫ్రికా, పాకిస్తాన్‌ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది. ఈ సిరీస్‌ జరుగుతుండగా సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్‌ అన్రిచ్‌ నోర్జే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 

టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా నోర్జే దూరంగా ఉన్నాడు. నోర్జే ఎడమకాలి బొటనవేలు ప్రాక్చర్‌ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. పాక్‌తో టీ20 సిరీస్‌కు నోర్జే ప్రత్యామ్నాయంగా అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ డయ్యాన్‌ గేలిమ్‌ ఎంపికయ్యాడు. గేలిమ్‌  తన 60 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 46 వికెట్లు పడగొట్టాడు.

కాగా, నోర్జే ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో చివరిసారి సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో నోర్జే సౌతాఫ్రికా తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా (15 వికెట్లు) ఉన్నాడు. వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా నోర్జే జాతీయ కాంట్రాక్ట్‌ నుంచి కూడా తప్పుకున్నాడు.

సౌతాఫ్రికాను పట్టి పీడిస్తున్న గాయాలు
ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. నోర్జే గాయపడిన అనంతరం సౌతాఫ్రికా క్యాజ్యువల్స్‌ (బౌలర్లు) సంఖ్య ఐదుకు చేరింది. నోర్జేకు ముందు గెరాల్డ్‌ కొయెట్జీ, నండ్రే బర్గర్‌, లుంగి ఎంగిడి, వియాన్‌ ముల్దర్‌ గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరంతా జట్టుకు దూరంగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలుత టీ20 సిరీస్‌ మొదలైంది. డిసెంబర్‌ 10న జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌పై సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కిల్లర్‌ మిల్లర్‌ ఊచకోత (82), జార్జ్‌ లిండే ఆల్‌రౌండ్‌ షో (48, 4/21) కారణంగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)