Breaking News

సాయి సుదర్శన్‌ మరో భారీ ఇన్నింగ్స్‌

Published on Sat, 07/04/2026 - 14:25

శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడిన అతడు.. ప్రస్తుతం​ జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అంతకంటే భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సాయి 267 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 168 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ సుదర్ఘీ ఇన్నింగ్స్‌ సాయిలోని స్టామినాను మరోసారి చూపింది. సాయి భారత టెస్ట్‌ జట్టులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో అతడి నుండి విదేశీ గడ్డపై రెండు భారీ ఇన్నింగ్స్‌లు రావడం​ శుభపరిణామం. 

సాయి టీమిండియా తరఫున వన్‌డౌన్‌లో ఆడతాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో తాజాగా జరిగిన ఏకైక టెస్ట్‌లో అతడు 81 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ కెరీర్‌లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన సాయి 3 అర్ద సెంచరీల సాయంతో 383 పరుగులు చేశాడు. శ్రీలంక-ఏపై తాజా సెంచరీలు సాయికి తదుపరి టెస్ట్‌ మ్యాచ్‌ల్లో మంచి బూస్టప్‌ ఇస్తాయి.

భారత జట్టు ఆగస్ట్‌లో శ్రీలంక పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లో సాయి తాజా అనుభవం టీమిండియాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత-ఏ జట్టులో ఉన్న సభ్యుల్లో సాయి ఒక్కడే భారత టెస్ట్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్నాడు.

వర్షం అంతరాయం
రెండో టెస్ట్‌ మూడో రోజు లంచ్‌ విరామం తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్‌ స్కోర్‌ 406-4 వద్ద ఉండగా వర్షం​ మొదలైంది. ఆ సమయానికి టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. సాయి సుదర్శన్‌  (168) డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (94) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. 

కెప్టెన్‌ ధృవ్‌ జురెల్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్‌ అమన్‌ మోఖడే 38 పరుగులకు ఔటయ్యాడు. షేక్‌ రషీద్‌ (16), సరాన్ష్‌ జైన్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సహాన్‌ అరచ్చ్చిగే (127) సెంచరీతో కదంతొక్కాడు. భారత బౌలర్లలో బ్రార్‌, సరాన్ష్‌ తలో 4 వికెట్లతో రాణించారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)