Breaking News

భారత్‌ గురి ‘బంగారం’

Published on Fri, 08/22/2025 - 00:47

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్  పాటిల్, అర్జున్‌ బబూటా, అంకుశ్‌ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది.  రుద్రాంక్ష్  632.3 పాయింట్లు, అర్జున్‌ 631.6 పాయింట్లు, అంకుశ్‌ 628.6 పాయింట్లు స్కోరు చేశారు. 

అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్  207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్‌ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్‌ (కజకిస్తాన్‌; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్‌కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్‌ పార్క్‌ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్‌కే స్వర్ణాలు దక్కాయి.

వ్యక్తిగత విభాగంలో అభినవ్‌ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్‌ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని  నెగ్గింది. జూనియర్‌ మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్‌ పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో హర్‌మెహర్‌ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్‌మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్‌లతో కూడిన బృందం టీమ్‌ స్కీట్‌ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత్‌ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్‌’లో ఉంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)