పృథ్వీ షా విధ్వంసకర శతకం.. డబుల్‌ సెంచరీ మరువక ముందే సుడిగాలి శతకం

Published on Sun, 08/13/2023 - 21:12

రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023లో నార్తంప్టన్‌షైర్‌ ఓపెనర్‌, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్‌ 9) సోమర్‌సెట్‌పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్‌ 13) డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7  సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్‌ కాగా.. నార్తంప్టన్‌షైర్‌ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

చెలరేగిన లూక్‌ ప్రాక్టర్‌..
తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌.. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ లూక్‌ ప్రాక్టర్‌ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్‌తో పాటు జేమ్స్‌ సేల్స్‌ (8-1-31-2), కియోగ్‌ (5.2-0-35-2), జాక్‌ వైట్‌ (10-0-49-1), కెర్రిగన్‌ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్‌ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్‌ ఇన్నింగ్స్‌లో ట్రెవాస్కిస్‌ (37), అలెక్స్‌ లీస్‌ (34), బుష్‌నెల్‌ (32), బోర్త్‌విక్‌ (20), ప్రిటోరియస్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

విధ్వంసకర డబుల్‌ సెంచరీని మరువక ముందే..
199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్‌ను ఓపెనర్‌ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్‌సెట్‌పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్‌ కియోగ్‌ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్‌ వైట్‌మన్‌ (4), లూక్‌ ప్రాక్టర్‌ (3) విఫలమయ్యారు. డర్హమ్‌ బౌలర్లలో జార్జ్‌ డ్రిస్సెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్‌నెల్‌ ఓ వికెట్‌ తీశాడు.  
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)