Breaking News

Ashes Series 2025: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌

Published on Fri, 01/31/2025 - 18:23

మహిళల యాషెస్‌ సిరీస్‌లోని (Women's Ashes Series 2025) ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (Annabel Sutherland) చరిత్ర సృష్టించింది. ఎంసీజీలో (MCG) (మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌) సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ మహిళా క్రికెటర్‌ ఇక్కడ మూడంకెల స్కోర్‌ చేయలేదు. 1935, జనవరి 18న ఎలిజబెత్‌ అలెక్సాండ్రా స్నోబాల్‌ ఎంసీజీలో అజేయమైన 83 పరుగులు చేసింది. మరో ఆసీస్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (98 నాటౌట్‌) ఇదే మ్యాచ్‌లో సెంచరీకి చేరువయ్యింది

కాగా, మహిళల యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జనవరి 30 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అ​న్నాబెల్‌ సెంచరీ (258 బంతుల్లో 21 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 163 పరుగులు) చేసింది. 23 ఏళ్ల అ​న్నాబెల్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో సెంచరీ. కేవలం ఆరు మ్యాచ్‌లో కెరీర్‌లోనే అన్నాబెల్‌ ఈ మూడు సెంచరీలు సాధించింది. ఈ మూడు సెంచరీల్లో ఓ డబుల్‌ సెంచరీ ఉండటం మరో విశేషం.

ఆసీస్‌కు భారీ ఆధిక్యం
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అన్నాబెల్‌ సెంచరీతో కదంతొక్కగా.. బెత్‌ మూనీ సెంచరీకి (98 నాటౌట్‌) చేరువైంది. మూనీకి జతగా తహ్లియా మెక్‌గ్రాత్‌ (9) క్రీజ్‌లో ఉంది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 45, జార్జియా వాల్‌ 12, కెప్టెన్‌ అలైసా హీలీ 34, ఆష్లే గార్డ్‌నర్‌ 44 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ కంటే 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ర్యానా మెక్‌డొనాల్డ్‌ గే ఓ వికెట్‌ దక్కించుకుంది.

అంతకుముందు అలానా కింగ్‌ (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. కిమ్‌ గార్త్‌, డార్సీ బ్రౌన్‌ తలో రెండు.. ఆష్లే గార్డ్‌నర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (25), వ్యాట్‌ హాడ్జ్‌ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్‌ గే (15 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్‌ 8, మయా బౌచియర్‌ 2, ఆమీ జోన్స్‌ 3, సోఫీ ఎక్లెస్టోన్‌ 1, లారెన్‌ ఫైలర్‌ 8, లారెన్‌ బెల్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న మహిళల యాషెస్‌ సిరీస్‌ మల్టీ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే  సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని  ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్‌.. 12-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్‌ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)