Breaking News

12 ఏళ్ల కింద‌ట స్పాట్ ఫిక్సింగ్‌.. క‌ట్ చేస్తే! ఇప్పుడు ఆ జ‌ట్టు హెడ్ కోచ్‌గా

Published on Fri, 07/04/2025 - 13:44

ముంబై క్రికెట్ ఆసోయేషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేదం ఎదుర్కొన్న మాజీ క్రికెట‌ర్  అంకిత్ చవాన్‌(Ankeet Chavan)ను త‌మ అండర్-14 జట్టు ప్ర‌ధాన కోచ్‌గా ఎంసీఎ నియ‌మించింది. ఐపీఎల్‌-2013 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌రపున ఆడిన‌ప్పుడు అజిత్ చండిలా, ఎస్ శ్రీశాంత్‌తో పాటు చ‌వాన్ స్పాట్ ఫిక్సింగ్ పాల్ప‌డ్డాడు.

దీంతో అత‌డిపై బీసీసీఐ(BCCI) జీవిత‌కాల నిషేదం విధించింది. కానీ 2021లో చవాన్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఏడు సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్‌లో వచ్చేందుకు అవకాశం లభించింది.  అంకిత్ ప్రస్తుతం ముంబైలో కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.

ఈ క్రమంలో లెవల్-1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. ఇప్పుడు ముంబై అండర్‌-14 హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్‌లో  18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 20 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. హెడ్‌కోచ్‌గా ఎంపికైన అనంతరం చవాన్ స్పందించాడు.

"నాకు ఇది రెండో ఇన్నింగ్స్‌. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చేంందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం.  అండర్-14 స్థాయిలో, ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చవాన్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై సీనియర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఓంకార్ సాల్వి కొనసాగనున్నాడు.
చదవండి: IND vs ENG: ఇలాంటి తప్పెలా చేశావు గిల్‌?.. యువీ తండ్రి అసంతృప్తి!
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)