Breaking News

'అంత తొంద‌ర ఎందుకు పంత్‌.. రూట్‌ను చూసి నేర్చుకో'

Published on Sat, 07/12/2025 - 21:04

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ రిష‌బ్ పంత్ అద్బుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. ఎడమ చేతి వేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌కు వ‌చ్చి జ‌ట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 141 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 

ఓవ‌రాల్‌గా 112 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కన్పించిన రిష‌బ్‌ దుర‌దృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అవ‌స‌రంలేని రన్‌కు ప‌రిగెత్తి తన వికెట్‌ను పంత్ కోల్పోయాడు. ఈ క్రమంలో పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శించారు. లంచ్ విరామానికి ముందు పంత్ అనవసరంగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడని కుంబ్లే మండిపడ్డాడు.

"రిష‌బ్ పంత్ అన‌వ‌స‌రంగా ఔట‌య్యాడు. అస్సలు అక్క‌డ ప‌రుగు వ‌చ్చే ఛాన్స్ లేదు. పంత్ మొద‌ట ప‌రుగుకు పిలుపిచ్చి, వెంట‌నే త‌న మ‌నసు మార్చుకున్నాడు. కానీ పంత్ పిలుపుతో కేఎల్ రాహుల్  వెంట‌నే నాన్ స్ట్రైక్ నుంచి ర‌న్ కోసం ప‌రిగెత్తాడు.

దీంతో ప్రారంభంలో పంత్ కాస్త సంకోంచి ప‌రిగెత్త‌డంతో ర‌నౌట్ అవ్వాల్సి వ‌చ్చింది. నిజంగా ఇది అన‌వ‌స‌రం. ఎందుకంటే మ‌రో మూడు బంతులు ఆడి ఉంటే, లంచ్ బ్రేక్‌కు వెళ్లిపోయేవారు. ఆ త‌ర్వాత త‌మ ప్రణాళిక‌ల‌ను అమ‌లు చేసి ఉంటే స‌రిపోయిండేది.

అంత‌కుముందు  జో రూట్ 99 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా ఆట ముగిసింది. త‌న సెంచ‌రీ కోసం అత‌డు ఒక రాత్రి వేచి ఉండాల్సి వ‌చ్చింది. కానీ అత‌డు ఎక్క‌డ కూడా తొంద‌ర‌ప‌డి ఆడ‌లేదు. పోప్‌, స్టోక్స్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. అదే వారు భారీ స్కోర్ సాధించ‌డంలో స‌హాయ‌ప‌డింది" అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)