Breaking News

టీమిండియాతో టీ20 సిరీస్‌.. వెస్టిండీస్‌కు గుడ్‌ న్యూస్‌! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు

Published on Tue, 07/18/2023 - 19:10

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ అండ్రీ రస్సెల్‌ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. విండీస్‌ క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగానే రస్సెల్ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. రస్సెల్‌ చివరగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021లో విండీస్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

అప్పటి నుంచి కరేబియన్‌ జట్టుకు కూడా కేవలం ఫ్రాంచైజీ లీగ్‌ల్లోనే ఆడుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం రస్సెల్‌ తన నిర్ణయం మార్చుకున్నాడు. మళ్లీ వెస్టిండీస్‌ జెర్సీని ధరించాలని అనుకుంటున్నట్లు రస్సెల్‌ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొ​ంటుంది. వన్డే ప్రపంచకప్‌-2023 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్‌, స్కాట్లాండ్‌ వంటి పసికూనల చేతిలో ఓటమి పాలైన విండీస్‌.. భారత్‌ వేదికగా జరగనున్న ప్రాధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో రస్సెల్‌ వంటి ఆటగాళ్లు సేవలు కచ్చితంగా విండీస్‌ అవసరం.

"నేను ఇకపై విండీస్‌ క్రికెట్‌కు అందుబాటులో ఉండనున్నాను. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగం కావడమే నా లక్ష్యం. జట్టులోకి తిరిగి రావడానికి అన్ని విధాల సిద్దంగా ఉన్నాను. ప్రపంచకప్‌కు కంటే ముందు వైట్‌బాల్‌ సిరీస్‌లలో కూడా ఆడాలి అనుకుంటున్నాను. త్వరలో టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు నాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను.

అయితే విండీస్‌ తరపున నేను ఆడాలంటే  రెండు ఫాంచైజీ లీగ్‌లకు దూరం కావాలి. నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచకప్‌ వంటి ఈవెంట్‌లో అద్భుతంగా రాణించి నా జట్టుకు మరో టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. నేను మా వైట్ బాల్ కోచ్ డారెన్ సామీతో టచ్‌లో ఉన్నాను.

అతడు కూడా నా పట్ల పాజిటివ్‌ మైండ్‌తో ఉన్నాడని" జమైకా అబ్జర్వర్‌తో రస్సెల్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్‌ తలపడనుంది. ట్రినిడాడ్‌ వేదికగా ఆగస్టు 3 నుంచి జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో రస్సెల్‌ విండీస్‌ తరపున రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: #Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్‌ తెలుసా? ఎంత అందంగా ఉందో


 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)