Breaking News

తమిళనాడుపై ఆంధ్ర పైచేయి

Published on Tue, 11/11/2025 - 05:56

సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా తమిళనాడుతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. 

నాలుగు మ్యాచ్‌ల్లో ఆంధ్ర నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగి శాయి. తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర... బ్యాటింగ్‌లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 102/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే  కుప్పకూలింది. సౌరభ్‌ (4/46), విజయ్‌ (2/16), పృథీ్వరాజ్‌ (2/31) తమిళ నాడును దెబ్బ కొట్టారు. 

తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... ఆంధ్ర ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఆంధ్ర 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిõÙక్‌ రెడ్డి (70; 11 ఫోర్లు), కరణ్‌ షిండే (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్‌ హెబ్బర్‌ (21 నాటౌట్‌; 2 ఫోర్లు), సత్యనారాయణ రాజు (20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో జార్ఖండ్‌తో ఆంధ్ర ఆడుతుంది.  
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)