Breaking News

నితీశ్ రెడ్డి అట్ట‌ర్ ప్లాప్‌.. అయినా ఆంధ్ర ఘ‌న విజ‌యం

Published on Sun, 12/14/2025 - 16:02

పుణే వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(47) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సైల్‌ ఆరోరా(42), రమణ్‌దీప్‌ సింగ్‌(43), హర్నార్‌ సింగ్‌(42) రాణించారు. 

ఆంధ్ర బౌలర్లలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సత్యనారాయణ రాజు, సౌరభ్‌ కుమార్‌, పృథ్వీరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. మధ్యప్రదేశ్‌పై హ్యాట్రిక్‌తో సత్తాచాటిన నితీశ్‌ రెడ్డి.. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌కే పరిమితమయ్యాడు.

హేమంత్‌ రెడ్డి సూపర్‌ సెంచరీ..
206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. నితీశ్‌ కుమార్‌ బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు శ్రీకర్‌ భరత్‌(1), అశ్విన్‌ హెబ్బర్‌(4), రికీ భుయ్‌(15) నిరాశపరిచారు. 

కానీ మర్మరెడ్డి హేమంత్‌ రెడ్డి సూపర్‌ సెంచరీతో సత్తాచాటాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హేమంత్‌తో పాటు ఎస్డీఎన్వీ ప్రసాద్‌(35 బంతుల్లో 53 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. ఆంధ్ర తమ తదుపరి సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో డిసెంబర్‌ 16న జార్ఖండ్‌తో తలపడనుంది. 
చదవండి: శతక్కొట్టిన జైస్వాల్‌.. సర్ఫరాజ్‌ ధనాధన్‌.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై
 

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)