Breaking News

టీమిండియా కెప్టెన్‌గా అతడు పనికిరాడు: భారత క్రికెటర్‌

Published on Tue, 07/16/2024 - 12:46

జింబాబ్వే పర్యటనను శబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో తేడాతో భారత్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా దెబ్బ తిన్న సింహంలా గర్జించింది. 

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్‌ చిత్తు చేసింది. తొలిసారి భారత జట్టు పగ్గాలను చేపట్టిన శుబ్‌మన్‌ గిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో గిల్‌ కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకున్నాడు. అయితే శుబ్‌మన్ గిల్‌ను అందరూ ప్రశంసిస్తుంటే.. భారత వెట‌ర‌న్ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా మాత్రం ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు.

గిల్ కెప్టెన్‌గా ప‌నికిరాడని, అస్సలు నాయకత్వ లక్షణాలు లేవ‌ని మిశ్రా  తెలిపాడు. మిశ్రా తాజాగా  శుభాంక‌ర్ మిశ్రా అనే యూట్యూబ‌ర్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో టీమిండియాకు ఫ్యూచ‌ర్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని ఎంపిక చేస్తారా అన్న ప్ర‌శ్న మిశ్రాకు ఎదురైంది.

"భార‌త్ ఫ్యూచ‌ర్ కెప్టెన్‌గా గిల్‌ను అస్స‌లు నేను ఎంపిక చేయ‌ను. అత‌డికి అస్స‌లు కెప్టెన్సీ స్కిల్స్ లేవు. ఐపీఎల్‌లోనే అత‌డి నాయ‌క‌త్వాన్ని చూశాను. అతనికి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియదని" మిశ్రా బ‌దులిచ్చాడు. 

కాగా ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన గిల్‌.. తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించి లీగ్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)