Breaking News

తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్‌ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ ధీర వనితలు

Published on Thu, 01/30/2025 - 14:20

ఆఫ్ఘనిస్తాన్‌ మహిళల క్రికెట్‌లో (Afghanistan Women's Cricket Team) నవశకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్‌ ధీర వనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల (Taliban) పాలనను వ్యతిరేకించి క్రికెట్‌ బరిలోకి దిగారు. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో (Melbourne Cricket Ground) క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవెన్‌తో ఇవాళ (జనవరి 30) ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌ ఆడారు. మహిళల యాషెస్‌ (ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌) టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌ జరిగింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా, క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి. 

2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు, అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీంతో ఆఫ్ఘన్‌ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకున్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయిన ఆఫ్ఘన్‌ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత జట్టుగా కూడి ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడారు.

చాలాకాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం. ఇప్పుడు అందరం కలిసి ఒక్కటయ్యాం అని ఓ ఆఫ్ఘన్‌ మహిళా క్రికెటర్‌ భావోద్వేగ ప్రకటన చేసింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని  తాలిబన్‌ ప్రభుత్వం మహిళలపై అనేక అంక్షలు అమల్లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువకోవడానికి వీల్లేదు. స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)