Breaking News

కేటీ... 13 పతకాలతో మేటి

Published on Sat, 08/03/2024 - 04:15

పారిస్‌: అమెరికా మహిళా స్విమ్మర్‌ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్‌ వీన్‌స్టెన్, పెయిజ్‌ మాడెన్, ఎరిన్‌ గిమెల్‌లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. 

తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్‌ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 

ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)