స్టార్లతో నిండిన కర్ణాటకకు షాక్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ

Published on Fri, 01/16/2026 - 07:42

నిన్న (జనవరి 15) జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. అమన్‌ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు. 

తద్వారా గత ఎడిషన్‌ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

పడిక్కల్‌ విఫలం.. రాణించిన కరుణ్‌ నాయర్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్‌ దర్శన్‌ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ (76), కృషణ్‌ శ్రీజిత్‌ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

ఈ ఎడిషన్‌లో దేవదత్‌ పడిక్కల్‌ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (9) కూడా డు ఆర్‌ డై మ్యాచ్‌లో హ్యాండిచ్చాడు. ధృవ్‌ ప్రభాకర్‌ (28), శ్రేయస్‌ గోపాల్‌ (36), అభినవ్‌ మనోహర్‌ (26), విజయ్‌ కుమార్‌ వైశాక్‌ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్‌ ఠాకూర్‌ 2, నచికేత్‌, యశ్‌ కదమ్‌ తలో వికెట్‌ తీశారు.

అమన్‌ అద్భుత శతకం
281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్‌ అమన్‌ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్‌కు జతగా రవికుమార్‌ సమర్థ్‌ (76 నాటౌట్‌) రాణించాడు. 

ధృవ్‌ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్‌ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)