Breaking News

World Cup 2025: వారి కోసం వరల్డ్‌కప్‌ గెలుస్తాం

Published on Tue, 10/07/2025 - 12:29

కొలంబో: భారత్‌లో మహిళల క్రికెట్‌ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పలువురి కోసం తాము వన్డే ప్రపంచ కప్‌ (ICC Womens ODI World Cup)ను గెలవాలని కోరుకుంటున్నట్లు భారత బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)వ్యాఖ్యానించింది. 

ఈ క్రమంలో బయట జరిగే చర్చ గురించి తాము పట్టించుకోమని, తమ దృష్టి మొత్తం విజయంపైనే ఉందని ఆమె వెల్లడించింది. ఆదివారం పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత జెమీమా తమ ప్రదర్శనపై మాట్లాడింది.  

సవాళ్ల గురించే చర్చ
‘మేం ఒకసారి ఒక మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళుతున్నాం. ప్రపంచ కప్‌ గురించి బయట ఎంతో చర్చ జరుగుతుందని మాకు తెలుసు. దాని ప్రభావం మాపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా బృందం సమావేశాల్లో కూడా ఆటలో ఎదురయ్యే సవాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. 

అప్పుడు మిథాలీ, జులన్‌.. ఇప్పుడు..
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నేను జట్టులోకి వచ్చినప్పుడు మిథాలీ, జులన్‌లాంటి సీనియర్లు నడిపించారు. ఇప్పుడు హర్మన్, స్మృతి కలిసి జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించే విధంగా వారు తీర్చిదిద్దారు. 

భారత మహిళల క్రికెట్‌ స్థాయిని పెంచిన మిథాలీ, జులన్, నీతూ డేవిడ్‌వంటి ప్లేయర్ల కోసం వరల్డ్‌ కప్‌ గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని జెమీమా పేర్కొంది. గువహటి, కొలంబో పిచ్‌లను బ్యాటర్లకు సవాల్‌గా నిలిచాయని, పరిస్థితులకు తగినట్లుగా తమ ఆటను మలచుకున్నామని ఆమె వివరించింది.  

చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)