శాంసన్ సరి​కొత్త చరిత్ర.. ధోనికి కూడా సాధ్యం కాలేదు

Published on Sun, 10/13/2024 - 13:08

హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ మూడో టీ20లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ కేరళ స్టార్ క్రికెటర్‌ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

శాంసన్‌ సాధించిన రికార్డులు ఇవే..
➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో మిల్లర్‌ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.

➔ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆరు సిక్స్‌లు బాదాడు.

➔భారత్‌ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు  భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో​ ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.

➔బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భార‌త క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంస‌న్ కేవ‌లం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్‌కోట్ వేదిక‌గా బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శ‌త‌కం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును శాంస‌న్ బ‌ద్ద‌లు కొట్టాడు.
చదవండి: డీఎస్పీగా బాధ్య‌త‌లు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌! ఫోటో వైర‌ల్‌

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)