Breaking News

లేటు వయసులో శతక్కొట్టారు.. ఒకరిది ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌

Published on Mon, 06/19/2023 - 16:19

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా నిన్న (జూన్‌ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్‌ విలియమ్స్‌ (70 బంతుల్లో 102 నాటౌట్‌; 13 ఫోర్లు, సిక్స్‌), క్రెయిగ్‌ ఎర్విన్‌ (128 బంతుల్లో 121 నాటౌట్‌; 15 ఫోర్లు, సిక్స్‌) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాడు గజానంద్‌ సింగ్‌ (109 బంతుల్లో 101 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు.

రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్‌ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్‌ఏ ఆటగాడు గజానంద్‌ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్‌ విలియమ్స్‌కు 36, క్రెయిగ్‌ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు.

కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్‌ విలియమ్స్‌, క్రెయిగ్‌ ఎర్విన్‌ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్‌ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్‌ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్‌ఏపై వెస్టిండీస్‌ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. 

  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)