Breaking News

వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. 286 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌

Published on Fri, 07/04/2025 - 09:16

సెయింట్‌ జార్జెస్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ విఫలమైంది. . ఓపెనర్లు సామ్‌ కొన్‌స్టాస్‌ (37 బంతుల్లో 25; 4 ఫోర్లు), ఉస్మాన్‌ ఖ్వాజా (29 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్టీవ్‌ స్మిత్‌ (3), కామెరూన్‌ గ్రీన్‌ (37 బంతుల్లో 26; 4 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (43 బంతుల్లో 29; 3 ఫోర్లు) పెవిలియన్‌కు వరుస కట్టారు. అయితే బ్యూ వెబ్‌స్టెర్(60), అలెక్స్ కారీ(63) మరోసారి హాఫ్ సెంచరీలతో  ఆసీస్‌ను ఆదుకున్నారు. 

దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేయగల్గింది.  వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టగా... సీల్స్ రెండు, షామార్‌ జోసెఫ్, ఫిలిప్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అయితే వెలుతురు లేమి కారణంగా తొలి రోజు కేవలం 66.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది.

బ్రాత్‌వైట్‌ 100వ టెస్టు 
వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ ఈ మ్యాచ్‌ ద్వారా వంద టెస్టులు ఆడిన పదో కరీబియన్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ ప్రభావంతో జాతీయ జట్టు కన్నా లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విండీస్‌ ప్లేయర్ల మధ్య బ్రాత్‌వైట్‌ ఈ ఘనత అందుకోవడం విశేషం.

జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడినా చాలు అనే లక్ష్యంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న బ్రాత్‌వైట్‌... సుదీర్ఘ ఫార్మాట్‌పై మక్కువతో టి20ల జోలికి వెళ్లకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు.
చదవండి: #Shubman Gill: టెస్టు క్రికెట్‌కు స‌రికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మ‌యం

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు